Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

పెంకుటింటికి రూ.1.43 లక్షల బిల్లు

Author
Posted By ARYADVI NEWS
| 01 Sep 2026, 06:54 PM | తాజా సమాచారం
పెంకుటింటికి రూ.1.43 లక్షల బిల్లు

8 నెలలుగా బిల్లు రాలేదని బాధితురాలి వెల్లడి
ఒక్కసారిగా రూ.1,43,136 బిల్లు
రెండు ఫ్యాన్లు, టీవీ, ఫ్రిడ్జ్ మాత్రమే

ములుగు మున్సిపాలిటీ పరిధిలోని ప్రేమ్‌నగర్‌లో ఓ కుటుంబానికి భారీ విద్యుత్‌ బిల్లు వచ్చింది. పెంకుటింట్లో నివసిస్తున్న తమకు ఏకంగా రూ.1,43,136 కరెంటు బిల్లు రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇంటి యజమాని కొమ్మినేని ప్రమీల తెలిపిన వివరాల ప్రకారం.. గతంలో ఐదేళ్లపాటు వేరే ప్రాంతంలో అద్దెకు ఉన్నామని, ఎనిమిది నెలలుగా ఈ ఇంట్లో నివసిస్తున్నామని తెలిపారు. అప్పటి నుంచి విద్యుత్‌ బిల్లు రాలేదని, తాజాగా మొత్తం రూ.1,43,136 బిల్లు వచ్చినట్లు చెప్పారు.

ఇవి కూడా చదవండి

తమ ఇంట్లో రెండు ఫ్యాన్లు, టీవీ, ఫ్రిడ్జ్‌, మూడు ఎల్‌ఈడీ బల్బులు మాత్రమే ఉన్నాయని ప్రమీల తెలిపారు. భారీ మొత్తంలో వచ్చిన బిల్లును మొత్తం చెల్లించాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.