80 కేజీల బస్తా రూ.16 వేలకు చేరిక
నెల్లూరు: ఏపీలో నిమ్మ ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. నెల్లూరు జిల్లా పొదలకూరు మార్కెట్లో 80 కేజీల నిమ్మ బస్తా ధర రూ.16 వేలకు చేరినట్లు వ్యాపారులు తెలిపారు. దీంతో కిలో నిమ్మకాయల ధర సుమారు రూ.200 పలుకుతోంది.
దిగుబడి తగ్గడం, వాతావరణ పరిస్థితులు, ఇతర ప్రాంతాల్లో నిమ్మకు డిమాండ్ పెరగడం ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. గతంలో కిలో రూ.30 నుంచి రూ.40 వరకు ఉన్న ధర ప్రస్తుతం భారీగా పెరగడంతో నిమ్మ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


