Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

పవర్ స్టార్ నుంచి డిప్యూటీ సీఎం వరకు.. పవన్ ప్రస్థానం!

Author
Posted By ARYADVI NEWS
| 02 Sep 2026, 09:01 AM | ANDHRA PRADESH
పవర్ స్టార్ నుంచి డిప్యూటీ సీఎం వరకు.. పవన్ ప్రస్థానం!

సినిమా నుంచి రాజకీయాల్లోకి.. 2024లో డిప్యూటీ సీఎం

అమరావతి: పవన్ కల్యాణ్ 55వ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినీ, రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 1971 సెప్టెంబర్ 2న జన్మించిన పవన్ కల్యాణ్ 1996లో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు.

‘తొలిప్రేమ’, ‘తమ్ముడు’, ‘బద్రి’, ‘ఖుషి’, ‘గబ్బర్‌సింగ్’, ‘అత్తారింటికి దారేది’ వంటి చిత్రాలతో ప్రత్యేకమైన అభిమానులను సంపాదించుకున్నారు. 2014లో జనసేన పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వచ్చిన ఆయనకు 2019 ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. అయినప్పటికీ రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించారు.

ఇవి కూడా చదవండి

2024 అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి విజయం సాధించిన పవన్ కల్యాణ్.. జనసేన పార్టీకి 21 స్థానాల్లో విజయాన్ని అందించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.