2009లో హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసిన వైఎస్సార్
హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించి నేటికి 17 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
2009 సెప్టెంబర్ 2న రచ్చబండ కార్యక్రమానికి వెళ్తుండగా వైఎస్సార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రతికూల వాతావరణం కారణంగా నల్లమల అడవుల్లోని రుద్రకొండ సమీపంలో కూలిపోయింది. ప్రమాదం తర్వాత దాదాపు 24 గంటల పాటు గాలింపు చర్యలు కొనసాగాయి. సెప్టెంబర్ 3న హెలికాప్టర్ శిథిలాలను గుర్తించారు.
వైఎస్సార్ మరణవార్తతో అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదం నెలకొంది