Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

ఘనంగా వైయస్సార్ వర్ధంతి

Author
Posted By ARYADVI NEWS
| 02 Sep 2026, 06:29 PM | TELANGANA
ఘనంగా వైయస్సార్ వర్ధంతి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా నూతనకల్ మండల కేంద్రము లో PACS చైర్మన్ నాగం జయసుధ-సుధాకర్ రెడ్డి గారి ఆద్వర్యంలో ఆ మహానేతకు ఘనంగా నివాళులర్పించారు... ఈ సందర్భంగా నాగం జయసుధ-సుధాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ
ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుని, వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలనే సంకల్పంతో డాక్టర్ వైఎస్సార్ ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని గుర్తుచేసుకున్నారు. రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, పేదలకు గృహ నిర్మాణం, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాల ద్వారా లక్షలాది కుటుంబాలకు అండగా నిలిచిన ప్రజానాయకుడని పేర్కొన్నారు... ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అద్యక్షులు బొడ్డుపల్లి అంజయ్య మండల కాంగ్రెస్ నాయకులు నకిరకంటి వెంకన్న,చురకంటి చంద్రారెడ్డి, ఉప సర్పంచ్ నాగం సరిత, రాజబహూదుర్ రెడ్డి, పాల్వాయి నాగరాజు, బంటు బద్రి, జటంగి గణేష్ యాదవ్, బద్దం ప్రశాంత్ రెడ్డి, శంబయ్య, మురళి, రవిశంకర్,నకిరకంటి రమేష్, శంకర్, మధు, బత్తుల మల్లయ్య, రవి తదితరులు పాల్గొన్నారు..