Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

కాలువలోకి దిగిన చంద్రబాబు.. గోదావరి జలాలకు సాష్టాంగ నమస్కారం!

Author
Posted By ARYADVI NEWS
| 02 Sep 2026, 07:50 PM | ANDHRA PRADESH
కాలువలోకి దిగిన చంద్రబాబు.. గోదావరి జలాలకు సాష్టాంగ నమస్కారం!

పాయకరావుపేట: ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు చేరిన వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద పోలవరం ఎడమ ప్రధాన కాలువలోకి దిగిన ఆయన గోదావరి నీటికి జలహారతి ఇచ్చారు. అనంతరం పవిత్ర జలాలను తలపై చల్లుకుని, గోదావరి ప్రవాహానికి సాష్టాంగ నమస్కారం చేశారు.

పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు చేరిన గోదావరి నీటితో సాగు, తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు ప్రయోజనం కలగనుంది. ఈ నీటితో నాలుగు జిల్లాల పరిధిలో 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, సుమారు 9 లక్షల మందికి తాగునీరు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.

మొత్తం 23.44 టీఎంసీల గోదావరి జలాలను వివిధ అవసరాలకు వినియోగించనున్నారు. అనకాపల్లి జిల్లాలో ఏలేరు కాలువతో పాటు 110 చెరువులను నింపేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. దీంతో ఆయకట్టు ప్రాంతాల్లో రైతులకు సాగునీటి ప్రయోజనం మరింత పెరగనుంది.

ఇవి కూడా చదవండి

గోదావరి జలాలు తమ ప్రాంతానికి చేరడంతో స్థానిక ప్రజలు, రైతులు ఆనందం వ్యక్తం చేశారు. కాలువల వెంట హారతులు ఇస్తూ నీటికి స్వాగతం పలికారు.