ఆర్మీలో చేరాలని ఎదురుచూస్తున్న యువతకు ఇది మంచి అవకాశం. అగ్నివీర్ పథకం కింద విశాఖపట్నంలో ఆర్మీ నియామక ర్యాలీ కొనసాగుతోంది. ఈ ర్యాలీని సెప్టెంబర్ 20 వరకు నిర్వహించనున్నారు.
విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వేదికగా నియామక ప్రక్రియ చేపడుతున్నారు. అభ్యర్థుల శారీరక సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఆర్కే బీచ్ రోడ్డులోని ఎన్టీఆర్ సర్కిల్ నుంచి 1.6 కిలోమీటర్ల రన్నింగ్ ట్రాక్ను ఏర్పాటు చేశారు.
ఆర్మీలో ఉద్యోగం సాధించాలనుకునే అర్హత కలిగిన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.


