Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

నవ్వాడని తండ్రిని చంపిన కొడుకు

Author
Posted By ARYADVI NEWS
| 03 Sep 2026, 08:58 AM | Array
నవ్వాడని తండ్రిని చంపిన కొడుకు

చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలో దారుణం జరిగింది. మద్యం తాగి ఇంటికి వచ్చిన తనను చూసి తండ్రి నవ్వాడనే కోపంతో ఓ వ్యక్తి ఆయనపై కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం.

మాణిక్యరాయునిపల్లెకు చెందిన చెంగారెడ్డికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు జోకేశ్‌రెడ్డి మద్యం సేవించి భార్యతో తరచూ గొడవపడేవాడని తెలుస్తోంది. బుధవారం రాత్రి అతడు మద్యం తాగి ఇంటికి రావడంతో భార్య విషయాన్ని చెంగారెడ్డికి చెప్పింది.

దీంతో చెంగారెడ్డి ఇంటికి వెళ్లి కుమారుడితో మాట్లాడుతున్న సమయంలో తనను చూసి నవ్వాడని జోకేశ్‌రెడ్డి ఆగ్రహానికి గురయ్యాడు. కత్తితో తండ్రిపై దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన చెంగారెడ్డి మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి