Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

రాష్ట్రంలో 52% వర్షపాత లోటు: సీఎం చంద్రబాబు

Author
Posted By ARYADVI NEWS
| 03 Sep 2026, 05:24 PM | TELANGANA
రాష్ట్రంలో 52% వర్షపాత లోటు: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో సాధారణం కంటే 52 శాతం వర్షపాతం లోటు నమోదైందని సీఎం చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 14 శాతం వర్షపాత లోటు ఉండగా.. రాష్ట్రంలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉందని తెలిపారు.

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా తాగునీరు, పశుగ్రాసం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

విపత్తు నిర్వహణ కింద కేంద్రం నుంచి అవసరమైన నిధులను తీసుకురావాలని, ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రజలకు వివరించాలని చంద్రబాబు పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.

ఇవి కూడా చదవండి