Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి? కాంగ్రెస్‌లో మళ్లీ చర్చ

Author
Posted By ARYADVI NEWS
| 03 Sep 2026, 07:33 PM | TELANGANA
రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి? కాంగ్రెస్‌లో మళ్లీ చర్చ

తెలంగాణ కేబినెట్‌లో ఖాళీ ఏర్పడిన నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్‌లో చర్చ మొదలైంది. ఈ క్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.

తన అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఒప్పించి మంత్రి పదవి ఇస్తే స్వీకరిస్తానని రాజగోపాల్ రెడ్డి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో రాబోయే కేబినెట్ విస్తరణలో ఆయనకు మంత్రి పదవి దక్కుతుందా? అనే చర్చ మొదలైంది. గతంలోనే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిపై హామీ ఇచ్చినట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించిన నేపథ్యంలో తాజా పరిణామాలకు ప్రాధాన్యం ఏర్పడింది.

ప్రస్తుతం వెంకట్ రెడ్డి స్థానంలో రాజగోపాల్ రెడ్డిని తీసుకుంటారా? లేక మరో సమీకరణంలో ఆయనకు అవకాశం కల్పిస్తారా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి