ఏపీలో మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కీలక అడ్డంకి తొలగింది. వార్డులు, డివిజన్ల పునర్విభజనను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వానికి మార్గం సుగమమైంది.
జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్ల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం చేపట్టిన పునర్విభజనపై పలు ప్రాంతాల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. గతంలో ఈ వ్యవహారంపై హైకోర్టు స్టే విధించింది. అయితే నిబంధనలకు అనుగుణంగానే పునర్విభజన చేపట్టామని, వార్డుల భౌగోళిక పరిధిలో మార్పులు చేయలేదని ప్రభుత్వం కోర్టుకు వివరించింది.
ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు పిటిషన్లను కొట్టివేయడంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఉన్న న్యాయపరమైన అడ్డంకులు తొలగినట్లైంది.


