శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా చాలామంది భక్తులు ఉపవాసం ఉంటారు. అయితే రోజంతా ఆహారం తీసుకోకుండా ఉండటం వల్ల నీరసం, తలతిరగడం, శక్తి తగ్గడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఉపవాసం చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది.
ఉపవాసానికి ముందు తేలికపాటి, పోషకాహారం తీసుకోవాలి. ఫలాహారం చేసేవారు పండ్లు, పెరుగు, కొబ్బరి నీళ్లు తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన శక్తి, ద్రవాలు అందేలా చూసుకోవాలి. నీరు తీసుకునే ఉపవాసమైతే తగినంత నీరు తాగుతూ హైడ్రేషన్ కొనసాగించాలి.
ఉపవాసం ముగిసిన వెంటనే ఎక్కువగా తినకుండా తేలికపాటి ఆహారంతో నెమ్మదిగా ప్రారంభించడం మంచిది.


