కాక్రోచ్ జనతా పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఉద్యమం పేరుతో రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తున్నారంటూ అసంతృప్తి వ్యక్తం చేసిన నేత మనీష్ బ్రహ్మభట్, ‘కాక్రోచ్ జనతా పార్టీ-డెమోక్రటిక్’ (సీజేపీ-డి) పేరుతో కొత్త వర్గాన్ని ప్రకటించారు.
సీజేపీ నాయకత్వం ఉద్యమాన్ని పక్కదారి పట్టించి ‘టీమ్ కేజ్రీవాల్’గా మార్చిందని బ్రహ్మభట్ ఆరోపించారు. కొద్దిమంది కలిసి జాతీయ నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారని, ఉద్యమం కోసం పోరాడిన కార్యకర్తలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని విమర్శించారు.
కొత్త వర్గంలో అంతర్గత ప్రజాస్వామ్యానికి ప్రాధాన్యం, వాలంటీర్లకు ఓటు హక్కు కల్పిస్తామని బ్రహ్మభట్ ప్రకటించారు. ‘హైకమాండ్’ విధానానికి దూరంగా రాష్ట్రాల్లో ఎన్నికైన బృందాలతో పనిచేస్తామని తెలిపారు.
ఇవి కూడా చదవండి
మరోవైపు, సీజేపీ ప్రధాన నాయకత్వం నుంచి ఈ తాజా చీలికపై ఇంకా అధికారికంగా పూర్తి స్థాయి స్పందన రావాల్సి ఉంది.


