Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

“బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. 4 రోజులు బంద్!”

Author
Posted By ARYADVI NEWS
| 04 Sep 2026, 05:28 PM | TELANGANA
“బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. 4 రోజులు బంద్!”

దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం సమ్మెకు సిద్ధమవుతున్నారు. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 11, 28, 29, 30 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెలు నిర్వహించనున్నారు. దీంతో ఆయా రోజుల్లో బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది.
ఉద్యోగులు ప్రధానంగా వారానికి ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. శనివారం, ఆదివారం సెలవులు ఇవ్వాలని, ఇందుకు బదులుగా సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజుకు అదనంగా 40 నిమిషాలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ప్రతిపాదనకు 2024లోనే అంగీకారం కుదిరినా ఇప్పటివరకు ఆమోదం రాకపోవడంపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
అలాగే సీనియర్ బ్యాంకు అధికారులకు అమలు చేయనున్న పనితీరు ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని యూనియన్లు వ్యతిరేకిస్తున్నాయి. ఈ విధానం ఉద్యోగుల మధ్య అసమానతలకు దారితీస్తుందని ఆరోపిస్తున్నాయి.
ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించకపోతే అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని బ్యాంకు ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి.