Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

పసిడి ధరలో స్వల్ప పెరుగుదల.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం రేట్లు ఇవే!

Author
Posted By ARYADVI NEWS
| 05 Sep 2026, 08:15 AM | BUSINESS
పసిడి ధరలో స్వల్ప పెరుగుదల.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం రేట్లు ఇవే!

దేశీయ మార్కెట్లో బంగారం ధరలు శనివారం స్వల్పంగా పెరిగాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలకు తాజాగా స్వల్ప పెరుగుదల నమోదైంది. 10 గ్రాముల బంగారంపై రూ.10 మేర ధర పెరిగింది. 24, 22, 18 క్యారెట్ల బంగారం ధరల్లోనూ ఈ పెరుగుదల కనిపించింది.

హైదరాబాద్ బులియన్ మార్కెట్ ప్రకారం.. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,670గా ఉంది. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.1,43,610కు చేరుకుంది. ఇక 18 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,17,500 వద్ద కొనసాగుతోంది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో కూడా దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి. విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, కడపతో పాటు తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ తదితర ప్రాంతాల్లోనూ బంగారం ధరలు ఇదే స్థాయిలో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

అంతర్జాతీయ మార్కెట్‌లో మార్పులు, దేశీయంగా బంగారానికి ఉన్న డిమాండ్, ఇతర మార్కెట్ పరిస్థితులు పసిడి ధరలపై ప్రభావం చూపుతాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆయా నగరాల్లోని నగల దుకాణాల వద్ద అప్పటి తాజా ధరను తెలుసుకోవడం మంచిది.