Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

కేటీఆర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. కారును ఢీకొట్టిన లారీ

Author
Posted By ARYADVI NEWS
| 05 Sep 2026, 08:01 PM | TELANGANA
కేటీఆర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. కారును ఢీకొట్టిన లారీ

కరీంనగర్‌ పర్యటనకు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. అలుగునూరు వద్ద కార్యక్రమం ముగించుకుని తిరిగి ప్రయాణం ప్రారంభించిన సమయంలో.. ఆయన ప్రయాణిస్తున్న కారును పక్క నుంచి వెళ్తున్న లారీ ఢీకొట్టింది.

లారీ ఢీకొనడంతో కారు వెనుక భాగంలోని డోర్‌ దెబ్బతింది. అయితే ప్రమాద సమయంలో కారులో ఉన్న కేటీఆర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో పార్టీ కార్యకర్తలు, నాయకులు ఊపిరి పీల్చుకున్నారు.

కరీంనగర్‌లో నిర్వహించనున్న విద్యార్థి, యువజన సదస్సులో పాల్గొనేందుకు కేటీఆర్‌ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కేటీఆర్‌ కాన్వాయ్‌కు సంబంధించిన వాహనాల్లో గతంలోనూ ప్రమాదాలు జరిగిన ఘటనలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి