సూర్యాపేట సెప్టెంబర్ 06:
కోదాడ పట్టణంలోని వర్తక సంఘ భవన్ లో ఆదివారం ఘనంగా కోదాడ మండల ఆర్ఎంపి & పిఎంపి నూతన ఎన్నికల కమిటీ సమావేశం జరిగినది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో జిల్లా అధ్యక్షులు దొంతగాని రవి, జిల్లా ఉపాధ్యక్షులు భూతం శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ ఎన్నికలలో కోదాడ ఆర్ఎంపీ మండల అధ్యక్షుడి గా పాలడుగు నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా ఉయ్యాల లింగయ్య లు ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్ఎంపీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, వైద్య సేవలను మరింత మెరుగుపరుస్తూ ప్రజలకు అందుబాటులో ఉండేలా సంఘ సభ్యులతో కలిసి పనిచేస్తానని తెలిపారు.అనంతరం నూతన అధ్యక్షుడిని సంఘ సభ్యులు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రెటరీ మలియాల పిచ్చయ్య, జిల్లా క్రమశిక్షణ అధ్యక్షులు ఎస్పీ వెంకటప్పయ్య, జిల్లా మాజీ అధ్యక్షులు భుజంగరావు, కొత్తగా ఎన్నికైన మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కొప్పుల అంజిరెడ్డి, ఉపాధ్యక్షులు అబ్దుల్ రహిమాన్, కందుల శ్రీకాంత్, మండల కోశాధికారి రంగా, సహాయ కార్యదర్శి ఎస్కే సలీం,కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.