బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (BITS Pilani)లో జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అర్హత ఉన్న అభ్యర్థులు నిర్ణీత గడువులో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్హత
ఫిజిక్స్ లేదా మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్‌లో ఫస్ట్ క్లాస్‌తో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. బీఎస్సీలో కనీసం 55 శాతం మార్కులు సాధించి ఉండాలి.
NET లేదా GATE అర్హత సాధించిన అభ్యర్థులకు ఎంపికలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
ఇవి కూడా చదవండి
ముఖ్యమైన వివరాలు
పోస్టు: జూనియర్ రీసెర్చ్ ఫెలో
స్టైపెండ్: నెలకు రూ.37,000 వరకు
దరఖాస్తు విధానం: ఆన్లైన్
చివరి తేదీ: సెప్టెంబర్ 30, 2026
ఎంపిక విధానం
అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించిన అనంతరం అర్హులైన వారిని షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక చేపడతారు.
అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు సంస్థ అధికారిక నోటిఫికేషన్‌లోని పూర్తి నిబంధనలు, అర్హతలను పరిశీలించాలి.
అధికారిక వెబ్సైట్: www.bits-pilani.ac.in


