సూర్యాపేట సెప్టెంబర్ 07:
కోదాడ లో ని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల లో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జి ( టాస్క్ ) ఆధ్వర్యంలో బీటెక్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ ,నాలుగవ సంవత్సరం చదువు తున్న విద్యార్థినులకు, *టాస్క్ నిపుణులు **రమేష్ * * ఆధ్వర్యంలో మహీంద్రా ప్రైడ్ స్కిల్స్ మీద శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగినది.ఈ శిక్షణ తరగతులలో విద్యార్థి నులకు మహేంద్ర ప్రైడ్ స్కిల్స్ పేరు మీద విద్యార్థి నులకు ఎంప్లాబిలిటీ స్కిల్స్ కోసం ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. ఈ శిక్షణ తరగతులు ఆరు రోజుల పాటు జరుగుతాయి అని తెలిపారు ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్ళపల్లి గాంధీ మాట్లాడుతూ , నేటి పోటీ ప్రపంచం లో విద్యార్థినులు వివిధ నైపుణ్యాలను పెంపొందించుకున్నప్పుడు మాత్రమే ఉన్నత ఉపాధి అవకాశాలు అందుకోవచ్చని అన్నారు.ఈ కార్యక్రమం లో విబాగాదిపతి స్రవంతి, అధ్యాపకులు, విద్యార్థి నులు పాల్గొన్నారు.