Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

ఎమ్మెల్యేలకు హైకోర్టు ఊరట.. పోలీసులకు కీలక ఆదేశాలు!

Author
Posted By ARYADVI NEWS
| 07 Sep 2026, 06:36 PM | TELANGANA
ఎమ్మెల్యేలకు హైకోర్టు ఊరట.. పోలీసులకు కీలక ఆదేశాలు!

హైదరాబాద్: అసెంబ్లీకి వెళ్లే ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోకూడదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. శాసనసభ్యులు నిబంధనలు ఉల్లంఘించినట్లయితే ఆ అంశాన్ని స్పీకర్ పరిధిలోనే పరిష్కరించాల్సి ఉంటుందని పేర్కొంది.అసెంబ్లీ సమీపంలో సోమవారం ఉదయం జరిగిన పరిణామాలపై విచారణ చేపట్టిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్యేలపై పోలీసులు నేరుగా చర్యలు తీసుకోరాదని ఆదేశించింది.మహిళా ఎమ్మెల్యేలపై దాడి జరిగిందన్న ఆరోపణలపైనా కోర్టు తీవ్రంగా స్పందించింది. ఘటనకు సంబంధించిన పోలీసు అధికారులను గుర్తించి, పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఆదేశించింది.బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకుని, మొత్తం వ్యవహారంపై సమగ్ర నివేదికను సమర్పించాలని డీజీపీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.