Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

తెలంగాణలో SIR గడువు పెంపు.. అక్టోబర్ 7 వరకు ఛాన్స్!

Author
Posted By ARYADVI NEWS
| 07 Sep 2026, 06:39 PM | TELANGANA
తెలంగాణలో SIR గడువు పెంపు.. అక్టోబర్ 7 వరకు ఛాన్స్!

హైదరాబాద్: తెలంగాణ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో కీలక మార్పు చోటుచేసుకుంది. అభ్యంతరాలు, క్లెయిమ్‌లు సమర్పించేందుకు ఎన్నికల సంఘం అదనపు సమయం ఇచ్చింది.ఇప్పటివరకు సెప్టెంబర్ 16 వరకు ఉన్న గడువును అక్టోబర్ 7 వరకు పొడిగించింది. దీంతో ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు లేదా అభ్యంతరాలు ఉన్నవారు మరింత సమయం పొందనున్నారు.ముసాయిదా జాబితాపై అభ్యంతరాల స్వీకరణ అనంతరం నవంబర్ 9న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్లు ఈసీ ప్రకటించింది.SIR ప్రక్రియకు మరింత సమయం కావాలని సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి ఈసీకి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో గడువు పొడిగిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.