మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై కీలక ప్రకటన చేశారు. దసరా మరుసటి రోజే పార్టీని ప్రకటిస్తానని తెలిపారు.టీడీపీ, వైసీపీలు కుటుంబ పార్టీలని విమర్శించిన ఆయన.. రాష్ట్రానికి మూడో రాజకీయ ప్రత్యామ్నాయం అవసరమని అన్నారు. తనను ఎవరైనా నమ్మకద్రోహి అంటూ విమర్శిస్తే, తన వద్ద ఉన్న నిజాలను బయటపెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను సాయిరెడ్డి ఖండించారు. కొత్త పార్టీలో తాను సీఎం అభ్యర్థిగా ఉండబోనని, సమర్థుడైన వ్యక్తిని ఆ స్థానంలో ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు.