Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

ఫెర్రీలో భారీ అగ్నిప్రమాదం.. 5 మంది మృతి

Author
Posted By ARYADVI NEWS
| 10 Sep 2026, 09:03 AM | క్రైమ్
ఫెర్రీలో భారీ అగ్నిప్రమాదం.. 5 మంది మృతి

ప్రయాణికులతో వెళ్తున్న ఫెర్రీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఐదుగురు మృతి చెందగా, 87 మంది ఆచూకీ తెలియడం లేదు.‘ఎంవీ జూన్ ఆస్టర్’ అనే ఫెర్రీ మనీలా నుంచి పలావాన్‌లోని కోరన్‌కు వెళ్తుండగా బరంగే మార్సిల్లా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో నౌకలో 117 మంది ప్రయాణికులు, 17 మంది సిబ్బంది ఉన్నారు.సమాచారం అందుకున్న ఫిలిప్పీన్ కోస్ట్ గార్డ్ వెంటనే సహాయక చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు సుమారు 43 మందిని సురక్షితంగా రక్షించినట్లు అధికారులు తెలిపారు. ఐదు మృతదేహాలను కూడా వెలికితీశారు.మరోవైపు గల్లంతైన వారి కోసం సముద్రంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అగ్నిప్రమాదానికి కారణం ఏమిటన్నది ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.