Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

జెలెన్‌స్కీ విమానానికి డ్రోన్ ముప్పు.. తప్పిన ప్రమాదం!

Author
Posted By ARYADVI NEWS
| 10 Sep 2026, 09:21 AM | INTERNATIONAL
జెలెన్‌స్కీ విమానానికి డ్రోన్ ముప్పు.. తప్పిన ప్రమాదం!

ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ ప్రయాణిస్తున్న విమానానికి డ్రోన్‌ ముప్పు తప్పింది. మాల్డోవా నుంచి ఆయన బయలుదేరే సమయంలో రష్యాకు చెందిన డ్రోన్లు ఆ దేశ గగనతలంలోకి ప్రవేశించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

నార్వే రాజు హెరాల్డ్‌-5 అంత్యక్రియల్లో పాల్గొనేందుకు జెలెన్‌స్కీ మాల్డోవా నుంచి ఓస్లోకు బయలుదేరుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. రెండు డ్రోన్లు గగనతలంలోకి రావడంతో చిసినావు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కొంతసేపు మూసివేశారు. దీంతో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడి జెలెన్‌స్కీ ప్రయాణం ఆలస్యమైంది.

జెలెన్‌స్కీ విమానానికి డ్రోన్‌ అత్యంత సమీపంలోకి వచ్చిందని నార్వే ప్రధాని జోనాస్ గహర్ స్టోర్ తెలిపారు. అయితే, విమానాన్ని డ్రోన్ దాదాపు ఢీకొట్టిందన్న ప్రచారంలో కొంత అతిశయోక్తి ఉందని ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయానికి చెందిన అధికారి పేర్కొన్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

జెలెన్‌స్కీ మాత్రం ఎలాంటి ప్రమాదం లేకుండా ఓస్లో చేరుకున్నారు. అనంతరం నార్వే అధికారులతో ఉక్రెయిన్‌కు మరిన్ని వాయు రక్షణ వ్యవస్థలు అందించే అంశంపై చర్చించారు. మాల్డోవా భూభాగంలో రష్యన్ డ్రోన్ ఒకటి కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై రష్యా నుంచి ఇప్పటివరకు అధికారిక స్పందన వెలువడలేదు.