Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

ఏపీలో మద్యం షాపుల లైసెన్సుల పొడిగింపు

Author
Posted By ARYADVI NEWS
| 12 Sep 2026, 08:52 AM | ANDHRA PRADESH
ఏపీలో మద్యం షాపుల లైసెన్సుల పొడిగింపు

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాల లైసెన్సులకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 3,736 మద్యం షాపుల లైసెన్సులను మరో ఏడాది పాటు పొడిగించింది. ఈ నిర్ణయం అక్టోబర్ 1, 2026 నుంచి అమల్లోకి రానుంది.ప్రస్తుత లైసెన్సుదారులు తమ లైసెన్సులను రెన్యువల్ చేసుకోవచ్చు. రెన్యువల్ చేయని షాపులను లాటరీ విధానంలో కొత్తవారికి కేటాయించనున్నారు. లాటరీలో పాల్గొనేందుకు రూ.3 లక్షల నాన్-రిఫండబుల్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది.అక్రమ మద్యం విక్రయాలను అరికట్టేందుకు నిఘాను కూడా పెంచారు. ప్రతి షాపులో నాలుగు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం తప్పనిసరి చేశారు. 24 గంటల పాటు ఏఐ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేయనున్నారు. అక్రమ మద్యం తయారీ, విక్రయాలపై సమాచారం అందించిన వారికి రూ.లక్ష వరకు రివార్డు ఇవ్వనున్నారు.