వినాయక చవితి వేడుకలకు ఖైరతాబాద్ బడా గణేష్ అంగరంగ వైభవంగా సిద్ధమయ్యాడు.ఈ ఏడాది ఏకంగా 69 అడుగుల ఎత్తులో భారీ గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
ప్రముఖ శిల్పి చిన్నస్వామి రాజేందర్ నేతృత్వంలో విగ్రహ నిర్మాణ పనులను పూర్తి చేశారు.ప్రతి ఏడాది ప్రత్యేక రూపాలు, భారీ విగ్రహాలతో భక్తులను ఆకట్టుకునే ఖైరతాబాద్ గణేశుడు.. ఈసారి కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు.విగ్రహ నిర్మాణం పూర్తవడంతో ఖైరతాబాద్ పరిసరాల్లో భక్తుల సందడి మొదలైంది.గణేష్ దర్శనం కోసం హైదరాబాద్తో పాటు నగరం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు.భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై కూడా చర్యలు చేపడుతున్నారు.