విజయనగరం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దత్తిరాజేరు మండలం షికారుగంటి జంక్షన్ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను బాడంగి మండలం గజరాయనివలసకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.