తమిళనాడు సీఎం విజయ్ లండన్ పర్యటనలో భారీ పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ప్రముఖ అంతర్జాతీయ సంస్థలతో రూ.11,000 కోట్ల విలువైన అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రిక్ వాహనాలు, డేటా సెంటర్లు, హెల్త్కేర్ రంగాల్లో పెట్టుబడులు రానున్నాయి. ఈ ఒప్పందాలతో రాష్ట్రంలో వేలాది ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది. తమిళనాడును 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని విజయ్ వెల్లడించారు.