పుణెలో 21 వేల పానీపూరీలతో ఏకంగా 13 అడుగుల ఎత్తైన గణపతి విగ్రహాన్ని రూపొందించారు.ఎఫ్సీ రోడ్డులో ఏర్పాటు చేసిన ఈ వినూత్న గణనాథుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాడు.రెండు నెలల పాటు శ్రమించి కళాకారులు ఈ విగ్రహానికి రూపమిచ్చారు.ఇదే సమయంలో చెన్నైలో 12 వేల శంఖాలతో మరో ప్రత్యేక గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.మరోవైపు నాసిక్లో కిలో రూ.27 వేల ధర పలికే గోల్డెన్ మోదకం కూడా ఆకట్టుకుంటోంది.