Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

అజ్మీర తండాలో పంచాయతీ భవనానికి శంకుస్థాపన.....

Author
Posted By ARYADVI NEWS
| 16 Sep 2026, 06:28 PM | TELANGANA
అజ్మీర తండాలో పంచాయతీ భవనానికి శంకుస్థాపన.....

సూర్యాపేట, సెప్టెంబర్ 16:అనంతగిరి మండలం అజ్మీర తండాలో రూ.20 లక్షల ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులతో నిర్మించనున్న నూతన గ్రామపంచాయతీ భవనానికి బుధవారం శంకుస్థాపన చేశారు. సర్పంచ్‌ అజ్మీర శ్రీవిద్య బాలకృష్ణ, మండల అధ్యక్షుడు ముసుకు శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో 200 గజాల స్థలాన్ని అందించిన దాత కంసాని నర్మదాతో శంకుస్థాపన చేయించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పంచాయతీ భవన నిర్మాణానికి విలువైన స్థలాన్ని అందించిన దాత కంసాని నర్మదాను అభినందించారు. గ్రామ అవసరాలను గుర్తించి స్థలాన్ని అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధిలో ప్రజల సహకారం కీలకమన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ కళ్యాణి, పంచాయతీ కార్యదర్శి విజయలక్ష్మి, సీనియర్‌ నాయకులు కొండపల్లి వాసు, మాజీ ఎంపీటీసీ గింజుపల్లి రమేష్‌, మండల ప్రధాన కార్యదర్శి జొన్నలగడ్డ కోటేశ్వరరావు, మాజీ సర్పంచ్‌ గాదే వెంకన్న, కాంగ్రెస్‌ గ్రామ శాఖ అధ్యక్షుడు అజ్మీర రమేష్‌, జెర్రిపోతుల నాగేశ్వరరావు,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.