ప్రధాని నరేంద్ర మోదీ 76వ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. బీజేపీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు, పారిశుద్ధ్య కార్యక్రమాలు, మొక్కలు నాటడం, ఆరోగ్య శిబిరాలు వంటి సేవా కార్యక్రమాలు చేపట్టారు.వారణాసిలో ప్రత్యేక పూజలు, గంగా హారతి, రక్తదాన కార్యక్రమాలు నిర్వహించగా.. ప్రధాని జన్మస్థలమైన వడోదరా ప్రాంతంలోనూ పలు కార్యక్రమాలు జరిగాయి. బీజేపీ ప్రకటించిన ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు వివిధ సేవా, ప్రజా భాగస్వామ్య కార్యక్రమాలు కొనసాగనున్నాయి.మోదీకి పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.