ఆంధ్రప్రదేశ్లో కోకా-కోలా సంస్థ భారీ పెట్టుబడులకు ముందుకొచ్చింది. మొత్తం రూ.1,127 కోట్లతో విజయనగరం, చిత్తూరు జిల్లాల్లో రెండు ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధమైనట్లు సమాచారం. ఇందులో విజయనగరం జిల్లాలో కొత్త తయారీ యూనిట్ కోసం రూ.842 కోట్లు, చిత్తూరు జిల్లాలోని ప్లాంట్ విస్తరణకు రూ.285 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు తెలుస్తోంది.విజయనగరం యూనిట్లో శీతల పానీయాలు, జ్యూస్లు, ఇతర ప్యాకేజ్డ్ ఉత్పత్తుల తయారీకి బాట్లింగ్ లైన్లు ఏర్పాటు చేయనున్నారు. శ్రీకాళహస్తి ప్లాంట్లోనూ కొత్త ఉత్పత్తి లైన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ప్రాజెక్టులతో స్థానికంగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.