స్పామ్ కాల్స్, రోబోకాల్స్కు అడ్డుకట్ట వేసేందుకు ట్రాయ్ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. కస్టమర్ విచారణ ఆధారంగా వాణిజ్య కాల్స్, సందేశాలను 7 రోజుల వరకే పంపేందుకు అనుమతి ఇచ్చింది.ముందుగా రికార్డు చేసిన వాయిస్‌తో చేసే ఆటోమేటెడ్ కాల్స్‌కు ప్రీ-డిక్లరేషన్ తప్పనిసరి చేసింది. డిక్లరేషన్ లేకుండా చేసే రోబోకాల్స్‌ను స్పామ్‌గా పరిగణించనున్నారు.అనుమతి లేకుండా చేసే ఆటోమేటెడ్ కాల్స్‌ను తగ్గించేందుకు ఒక్కో కాల్‌కు 5 పైసల టెర్మినేషన్ ఛార్జీ విధించనున్నారు. దీంతో రోబోకాల్స్ దుర్వినియోగాన్ని అడ్డుకోవాలని ట్రాయ్ భావిస్తోంది.అలాగే విద్యుత్, నీరు, గ్యాస్, ఎల్పీజీ వంటి సేవలకు 1601 సిరీస్ నంబర్లను విస్తరించనున్నారు. దీంతో నకిలీ కాల్స్, మోసపూరిత కాల్స్‌ను గుర్తించడం వినియోగదారులకు సులభం కానుంది.