డిజిటల్ ఆధారాలతో నిందితులపై పోలీసుల బలమైన కేసు
పుణె: రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో పుణె రూరల్ పోలీసులు 5,053 పేజీల ఛార్జ్షీట్ను కోర్టులో దాఖలు చేశారు. గతేడాది జూన్ 18న లోహగడ్ కోటపై నుంచి కేతన్ను తోసివేయడంతో మృతి చెందినట్లు దర్యాప్తులో తేలింది. కేసులో కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి, మరో వ్యక్తి రితేష్ హాంగేను పోలీసులు అరెస్ట్ చేశారు.
దర్యాప్తులో మెసేజ్లు, ఫోన్ డేటా, కాల్ రికార్డులు, ఫొటోలు, సాక్షుల వాంగ్మూలాలు వంటి ఆధారాలను పోలీసులు సేకరించారు. హత్యకు ముందే నిందితులు ఘటనపై ఆన్లైన్లో సమాచారాన్ని వెతికినట్లు ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. ముఖ్యంగా ఇలాంటి గత హత్య కేసుల గురించి సెర్చ్ చేసిన డిజిటల్ ఆధారాలు దర్యాప్తులో కీలకంగా మారినట్లు పోలీసులు తెలిపారు.