Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

విశాఖను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ అమర్నాథ్ ఫైర్

Author
Posted By ARYADVI NEWS
| 20 Sep 2026, 08:29 PM | ANDHRA PRADESH
విశాఖను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ అమర్నాథ్ ఫైర్

అమరావతికి ప్రాధాన్యం ఇస్తూ విశాఖపట్నం అభివృద్ధిని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు.విశాఖలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. స్థానిక సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం ప్రచారానికే పరిమితమవుతోందని అన్నారు.
ఇళ్ల పట్టాల పంపిణీని కూడా రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని అమర్నాథ్ విమర్శించారు. విశాఖలో భూముల వ్యవహారంలో మంత్రి నారా లోకేశ్ బంధువులు, స్థానిక ఎంపీపై ఆయన ఆరోపణలు చేశారు.తాగునీటి సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, విశాఖ ప్రజల సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందని అమర్నాథ్ తెలిపారు.