Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

కోర్టు ధిక్కరణ కేసులో మాజీ ఏసీపీకి జైలు

Author
Posted By ARYADVI NEWS
| 20 Sep 2026, 08:39 PM | TELANGANA
కోర్టు ధిక్కరణ కేసులో మాజీ ఏసీపీకి జైలు

హైదరాబాద్‌లో కోర్టు ధిక్కరణ కేసులో ఎల్‌బీ నగర్ మాజీ ఏసీపీ ఎ. కృష్ణయ్యకు తెలంగాణ హైకోర్టు నెల రోజుల కఠిన కారాగార శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది.
ఓ కేసులో నిందితుడిని అరెస్ట్ చేయకుండా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ.. అప్పటి ఏసీపీ కృష్ణయ్య నిందితుడిని అరెస్ట్ చేశారు. దీంతో కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు.విచారణ అనంతరం కోర్టు ధిక్కరణ జరిగినట్లు హైకోర్టు నిర్ధారించింది. ఏసీపీ క్షమాపణ చెప్పినప్పటికీ.. కోర్టు ఆదేశాలను అమలు చేయడం అధికారుల బాధ్యత అని పేర్కొంటూ శిక్ష విధించింది.అయితే తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు వీలుగా శిక్ష అమలును నాలుగు వారాల పాటు హైకోర్టు నిలిపివేసింది.