Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

పాలిటెక్నిక్‌ల విలీనానికి బ్రేక్.. విద్యార్థుల పోరాటం సక్సెస్

Author
Posted By ARYADVI NEWS
| 21 Sep 2026, 09:51 AM | TELANGANA
పాలిటెక్నిక్‌ల విలీనానికి బ్రేక్.. విద్యార్థుల పోరాటం సక్సెస్

హైదరాబాద్‌: 35 రోజులుగా కొనసాగుతున్న పాలిటెక్నిక్ విద్యార్థులు, అధ్యాపకుల ఆందోళనకు ఫలితం దక్కింది. యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీలో పాలిటెక్నిక్‌ కాలేజీల విలీనం ప్రతిపాదనపై ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు సమాచారం.
ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలు ఇకపై సాంకేతిక విద్యాశాఖ పరిధిలోనే కొనసాగనున్నాయి. సాంకేతిక విద్యాశాఖ, సాంకేతిక విద్యామండలి యథావిధిగా కొనసాగుతాయి. డిప్లొమా కోర్సులు, పరీక్షల విధానం, AICTEకి సంబంధించిన అంశాల్లోనూ ప్రస్తుత విధానమే కొనసాగనుంది.
ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియకు కూడా బ్రేక్‌ పడినట్లు తెలుస్తోంది. అధ్యాపకుల సహాయ నిరాకరణతో పాటు విద్యార్థుల నిరసనలు ఉధృతం కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
విద్యార్థులు, అధ్యాపకుల 35 రోజుల పోరాటానికి ఇది కీలక మలుపుగా మారింది.