Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

లోకేశ్ రాజీనామా చేయాలి: జగన్

Author
Posted By ARYADVI NEWS
| 22 Sep 2026, 08:29 AM | ANDHRA PRADESH
లోకేశ్ రాజీనామా చేయాలి: జగన్

డీఎస్సీ నియామకాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. నియామకాల్లో అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ప్రభుత్వం అంగీకరించే వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగిస్తామని జగన్ ప్రకటించారు. విజయవాడలో వైసీపీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారని ఆయన ఆరోపించారు.నిరుద్యోగ యువతకు న్యాయం జరగాలంటే డీఎస్సీ నియామక ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని జగన్ పేర్కొన్నారు. ప్రభుత్వం క్లీన్‌చిట్ ఇచ్చుకోవడం కంటే స్వతంత్ర దర్యాప్తునకు సిద్ధపడాలని సూచించారు.