ఆర్యాద్వి తెలుగు పత్రిక :బాధ్య తండాలో గజేంద్ర యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ కృష్ణ నాయక్ గారు హాజరై, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ కృష్ణ నాయక్ గారు మాట్లాడుతూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయం అని యూత్ ను అభినందించారు.ఈ కార్యక్రమంలో దాతలు N, నాగులు గారు (10 కిలోల బియ్యం) మరియు N, భీకు గారు (15 కిలోల బియ్యం) అందించి సహకరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.