పలు సంస్థలకు లోకేశ్ ఆహ్వానం
విశాఖలో టెక్ కేంద్రాలపై ప్రతిపాదనలు
తిరుపతిలో కాంపోనెంట్స్ పార్క్కు సూచన
ఏపీలో పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో మంత్రి నారా లోకేశ్ ఢిల్లీలో పలు ప్రముఖ సంస్థల ప్రతినిధులతో వరుసగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు, టెక్నాలజీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆయా సంస్థలను ఆహ్వానించారు.కాకినాడలో గ్రీన్ అమ్మోనియా కేంద్రం ఏర్పాటుకు యారా, ఆగ్రో కెమికల్ యూనిట్ కోసం గోద్రెజ్ను కోరారు. విశాఖలో టెక్నాలజీ, ఇంజనీరింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సిస్కో, ఎస్ఏపీ సంస్థలకు ప్రతిపాదించారు.తిరుపతిలో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ తయారీ పార్క్ ఏర్పాటు చేయాలని వివోను, ఏపీలో వైద్య పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటుకు అబాట్ను ఆహ్వానించారు.విశాఖలో మాస్టర్కార్డ్ టెక్నాలజీ కేంద్రం, స్టార్టప్లకు సహకారం అందించాలని లోకేశ్ కోరారు. పలు సంస్థలు ఏపీ ప్రతిపాదనలను పరిశీలిస్తామని తెలిపాయి.