Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

గంగమ్మ ఒడికి బాలాపూర్ గణేష్.. కిక్కిరిసిన ట్యాంక్ బండ్

Author
Posted By ARYADVI NEWS
| 25 Sep 2026, 05:59 PM | TELANGANA
గంగమ్మ ఒడికి బాలాపూర్ గణేష్.. కిక్కిరిసిన ట్యాంక్ బండ్

బాలాపూర్ గణేషుడి నిమజ్జనం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. హుస్సేన్‌సాగర్‌ క్రేన్‌-2 వద్ద గణనాథుడిని నిమజ్జనం చేశారు. భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ట్యాంక్‌బండ్‌ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.నిమజ్జనం సమయంలో భక్తులు ‘బై బై గణేషా’ అంటూ నినాదాలు చేశారు. చార్మినార్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ వరకు బాలాపూర్‌ గణేష్‌ ఊరేగింపు కొనసాగగా.. దాదాపు రెండు గంటల సమయం పట్టింది.బాలాపూర్‌ గణేష్‌ వెంట వందలాది ఇతర విగ్రహాలు కూడా ట్యాంక్‌బండ్‌ వైపు తరలివచ్చాయి. నిమజ్జన కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. సుమారు 5 వేల మంది పోలీసులను విధుల్లో మోహరించారు.
నగరంలో ఇప్పటివరకు సుమారు 20 శాతం విగ్రహాల నిమజ్జనం పూర్తయినట్లు సమాచారం. మరో 80 శాతం విగ్రహాల నిమజ్జనం జరగాల్సి ఉంది.