మహారాష్ట్ర భీవండిలో జరిగిన అత్యాచార కేసులో నిందితుడి తల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు.తన కొడుకైనా తప్పు చేస్తే కఠిన శిక్ష విధించాలని ఆమె కోరారు. అవసరమైతే ఉరితీయాలని డిమాండ్ చేశారు.సెప్టెంబర్ 13న ఓ వివాహితపై అత్యాచారం జరిగినట్లు కేసు నమోదైంది. తుపాకీతో బెదిరించి, బలవంతంగా మద్యం తాగించినట్లు బాధితురాలు ఆరోపించారు.ఈ కేసులో కానిస్టేబుల్ శైలేష్ పాటిల్, మాజీ ఎమ్మెల్యే నరేంద్ర పవార్ నిందితులుగా ఉన్నారు. శైలేష్ను పోలీసులు విధుల నుంచి తొలగించారు.తన కొడుకు గతంలోనూ మహిళలను వేధించాడని తల్లి ఆరోపించారు. తనను కూడా తుపాకీతో బెదిరించి ఆస్తులు లాక్కున్నాడని వాపోయారు.తన కుమారుడికి కఠిన శిక్షతో పాటు తన ఆస్తులను తిరిగి ఇప్పించాలని అధికారులను ఆమె కోరారు.