Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

చిట్టీల పేరుతో రూ.10 కోట్ల మోసం.. టీచర్ పరారీ

Author
Posted By ARYADVI NEWS
| 27 Sep 2026, 09:23 AM | TELANGANA
చిట్టీల పేరుతో రూ.10 కోట్ల మోసం.. టీచర్ పరారీ

సూర్యాపేట జిల్లాలో చిట్టీల పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ ఉపాధ్యాయుడు కుటుంబంతో కలిసి పరారైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సూర్యాపేటలో నివసించే ఆ టీచర్.. సొంత తండాతో పాటు చుట్టుపక్కల 12 గ్రామాల ప్రజలు, బంధువులు, ఉద్యోగుల నుంచి చిట్టీల పేరుతో డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.దాదాపు రూ.10 కోట్లకు పైగా వసూలు చేసినట్లు బాధితులు చెబుతున్నారు. ఏడాదిగా డబ్బులు తిరిగి ఇవ్వకుండా వాయిదాలు వేస్తూ వచ్చారని తెలిపారు.పరారయ్యే ముందు భూముల్లో కొంత భాగాన్ని ఇతరుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేసినట్లు బాధితులు ఆరోపించారు. హైదరాబాద్‌కు తీసుకెళ్లిన ఇద్దరిని హోటల్‌లో వదిలి వెళ్లిన తర్వాత అతడి ఆచూకీ లేకుండా పోయిందని తెలిపారు.బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.