దేశాభివృద్ధిలో రాబోయే 20 ఏళ్లు కీలకమని సీఎం చంద్రబాబు అన్నారు. పాలనలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్త విధానాలు, సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విజయవాడలో జరిగిన మిషన్ కర్మయోగి దక్షిణాది రాష్ట్రాల సదస్సులో ఆయన మాట్లాడారు.ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్యాల పెంపులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే తొలి స్థానంలో నిలిచిందని తెలిపారు. శిక్షణ కేవలం సర్టిఫికెట్లకే పరిమితం కాకుండా.. ప్రజలకు అందే ప్రభుత్వ సేవల్లో దాని ఫలితం కనిపించాలని స్పష్టం చేశారు.పాలనా వ్యవస్థలో ఏఐ, ఇతర ఆధునిక సాంకేతికతలను విస్తృతంగా వినియోగించాలని చంద్రబాబు సూచించారు. పాత పద్ధతులు, అనవసరమైన పేపర్వర్క్ను తగ్గించి పాలనా ప్రక్రియలను సరళీకరించాలని అధికారులను ఆదేశించారు. ఉద్యోగులు తమ నైపుణ్యాలను నిరంతరం పెంచుకుంటే మెరుగైన సేవలు అందించగలరని అన్నారు.