Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

గాడ్సే భావజాలాన్ని తిప్పికొట్టాలి: భట్టి

Author
Posted By ARYADVI NEWS
| 02 Oct 2026, 06:37 PM | TELANGANA
గాడ్సే భావజాలాన్ని తిప్పికొట్టాలి: భట్టి

హైదరాబాద్: గాంధీ జయంతి సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా సమాజాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, గాడ్సే భావజాలాన్ని ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

గాంధీజీ పాటించిన సత్యం, అహింస, శాంతి మార్గాలు దేశానికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని భట్టి విక్రమార్క అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను కూడా ఐక్యంగా ఎదుర్కోవాలని ఆయన పేర్కొన్నారు.

గాంధీజీ ఆశయాల స్ఫూర్తితోనే తెలంగాణ ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని భట్టి తెలిపారు. కులం, మతంతో సంబంధం లేకుండా విద్యార్థులందరికీ నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

ఇవి కూడా చదవండి

వివక్షకు తావులేని సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.