ఆసియా క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ చైనాను 1-0తో ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. దీంతో ఆసియా క్రీడల్లో మహిళల హాకీ స్వర్ణం కోసం భారత్ ఎదురుచూసిన 44 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది.
తొలి క్వార్టర్లో లాల్రెమ్సియామి హ్మర్జోతే ఫీల్డ్ గోల్‌తో భారత్‌కు ఆధిక్యం అందించింది. ఆ తర్వాత చైనా పదేపదే దాడులు చేసినా భారత డిఫెన్స్ వాటిని సమర్థంగా అడ్డుకుంది. కీలక దశలో గోల్‌కీపర్ సవితా పూనియా పెనాల్టీ స్ట్రోక్‌ను అడ్డుకోవడంతో భారత్ ఆధిక్యాన్ని కాపాడుకుంది.
ఆసియా క్రీడల్లో మహిళల హాకీలో భారత్‌కు ఇది రెండో స్వర్ణం. 1982 న్యూఢిల్లీ ఆసియా క్రీడల్లో తొలిసారి పసిడి సాధించిన భారత జట్టు.. 44 ఏళ్ల తర్వాత మరోసారి ఛాంపియన్‌గా నిలిచింది.
ఇవి కూడా చదవండి
ఈ విజయంతో భారత్ 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించింది. తాజా స్వర్ణంతో ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలోని బంగారు పతకాల సంఖ్య 16కు చేరింది.


