Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

ఎమ్మెల్సీ బరిలోనే ఉన్నా: సర్వోత్తమ్‌రెడ్డి

Author
Posted By ARYADVI NEWS
| 03 Oct 2026, 05:02 AM | TELANGANA
ఎమ్మెల్సీ బరిలోనే ఉన్నా: సర్వోత్తమ్‌రెడ్డి

నల్గొండ-వరంగల్‌-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా తాను పోటీలోనే ఉన్నానని ఆర్‌.సర్వోత్తమ్‌రెడ్డి స్పష్టం చేశారు. తాను పోటీ నుంచి తప్పుకున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం తన స్పష్టమైన నిర్ణయమని సర్వోత్తమ్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని వెల్లడించారు.తన అభ్యర్థిత్వంపై పార్టీలోని ఓ మంత్రి అసంతృప్తితో ఉన్నారని, పోటీ నుంచి తప్పుకోవాలని తనపై ఒత్తిడి తెచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. గురు, శుక్రవారాల్లో ఈ విషయంలో ప్రయత్నాలు జరిగినప్పటికీ.. ఎన్నికల బరిలో కొనసాగేందుకే సర్వోత్తమ్‌రెడ్డి నిర్ణయించుకున్నట్లు సమాచారం.