Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

అమీనాబాద్‌లో రూ.12 లక్షలతో నిర్మించిన అంగన్వాడి భవనం ప్రారంభం

Author
Posted By ARYADVI NEWS
| 04 Oct 2026, 09:10 AM | TELANGANA
అమీనాబాద్‌లో రూ.12 లక్షలతో నిర్మించిన అంగన్వాడి  భవనం ప్రారంభం

– నూతన భవనాన్ని ప్రారంభించిన కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

– చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం

అనంతగిరి, అక్టోబర్ 03 (ఆర్యాద్వి):

అనంతగిరి మండలం అమీనాబాద్ గ్రామంలో MGNREGS నిధులు రూ.12 లక్షలతో నూతనంగా నిర్మించిన అంగన్వాడి భవనాన్ని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా నూతన అంగన్వాడి భవనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారులకు మెరుగైన వాతావరణంలో పూర్వ ప్రాథమిక విద్యతో పాటు పౌష్టికాహారం, ఆరోగ్య సేవలు అందించేందుకు అంగన్వాడి కేంద్రాలు ఎంతో కీలకమని పేర్కొన్నారు.నూతన భవనం అందుబాటులోకి రావడంతో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అంగన్వాడి ల ద్వారా సేవలు మరింత సౌకర్యవంతంగా అందనున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అంగన్వాడి సిబ్బంది, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

అమీనాబాద్‌లో రూ.12 లక్షలతో నిర్మించిన అంగన్వాడి  భవనం ప్రారంభం - Additional Image