Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్‌లో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందిని అభినంధించిన పోలీస్ కమిషనర్

Author
Posted By ARYADVI NEWS
| 04 Oct 2026, 09:18 AM | TELANGANA
తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్‌లో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందిని అభినంధించిన పోలీస్ కమిషనర్

ఖమ్మం ప్రతినిధి: అక్టోబర్, 3:సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 01, 2026 వరకు హైదరాబాద్‌లోని తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ (TSPA) లో నిర్వహించిన తెలంగాణ స్టేట్ 5 వ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026లో షటిల్ బ్యాడ్మింటన్, లాన్ టెన్నిస్ (గెజిటెడ్ ఆఫీసర్ క్యాటగిరిలో) తదితర క్రీడా పోటీల్లో ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో విజేతలుగా నిలిచి బంగారు, వెండి, కాస్యం పతకాలతో ఖమ్మం పోలీస్ కమిషనరేట్‌కు గుర్తింపు తీసుకొచ్చినఅడిషనల్ డీసీపీ లు కుమారస్వామి, విజయబాబు, హెడ్ కానిస్టేబుల్ బి. దాసు, కానిస్టేబుల్ యండి. ఫైయాజ్ ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు.
క్రీడల్లో ప్రతిభ కనబరచడం ద్వారా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావడం అభినందనీయమని కమిషనర్ పేర్కొన్నారు. విధి నిర్వహణతో పాటు క్రీడలపై ఆసక్తిని పెంపొందించుకోవడం ద్వారా శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ పెంపొందుతాయని తెలిపారు.భవిష్యత్తులోనూ క్రీడా పోటీల్లో పాల్గొని మరిన్ని విజయాలు సాధించాలని పోలీసు సిబ్బందికి పోలీస్ కమిషనర్ ఆకాంక్షించార.