Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రం ప్రారంభం

Author
Posted By ARYADVI NEWS
| 04 Oct 2026, 11:15 PM | TELANGANA
పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రం ప్రారంభం

కోదాడ అక్టోబర్ 04 (ఆర్యాద్వి): నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల నమోదు కార్యక్రమం కోదాడలోని లక్ష్య అకాడమీ సంస్థలో BMS ఆధ్వర్యంలో జిల్లా కన్వీనర్ అనంతుల సతీష్ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకునే విధానం, అవసరమైన ధ్రువపత్రాలు, దరఖాస్తు ప్రక్రియపై అవగాహన కల్పించారు. పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటు హక్కుకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఇప్పటికే నమోదు చేసుకున్న వారు తమ పేరు, వివరాలు ఓటర్ల జాబితాలో సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని నిర్వాహకులు సూచించారు.
అర్హులైన పట్టభద్రులు గడువు ముగిసేలోగా తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ అడ్వకేట్ అక్కిరాజు యశ్వంత్, BMS జిల్లా కో-కన్వీనర్ మండవ మధు, బ్రిలియంట్ స్కూల్ ప్రిన్సిపాల్ జగన్ మోహన్ రెడ్డి, *బూర శ్రీకాంత్, గోదేశీ లక్ష్మణ్, వనం నాగేశ్వరరావు, లక్ష్య ఎడ్యుకేషన్ కో-ఆర్డినేటర్ మమత, రమేష్ చారి తదితరులు పాల్గొన్నారు.